ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు

ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు

 హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ బస్తీ ప్రేమ్ నగర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓ స్రాప్ గోదాంలో చెలరేగిన మంటలు క్రమంగా  పెరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

విషయం తెలుసుకున్న ఫైర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తుంది. ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.