ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి : మనోజ్ కుమార్ మాణిక్ రావు

ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి : మనోజ్ కుమార్ మాణిక్ రావు
  • జనరల్ అబ్జర్వర్ మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ 

సూర్యాపేట, వెలుగు : లోక్ సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ అధికారులకు సూచించారు. శుక్రవారం ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని   ఆయన పరిశీలించారు. అంతకుముందు కొత్త మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూమ్ ను కలెక్టర్ ఎస్. వెంకట్​రావు, ఎస్పీ రాహుల్ హెగ్డేతో  కలిసి పరిశీలించారు.

పోలింగ్ యంత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన "నేను ఓటు వేస్తాను.. ఎందుకంటే నేను ఇండియాను ప్రేమిస్తాను" అనే నినాదంతో ఏర్పాటు చేసిన సెల్ఫీ కేంద్రంలో ఆయన ఫొటో దిగారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్లు బీఎస్ లత, ప్రియాంక,  అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఆర్డీవో వేణుమాధవ్ తదితరులు ఉన్నారు.  

క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలి

యాదాద్రి, వెలుగు : పోలింగ్ ప్రక్రియను  మైక్రో అబ్జర్వర్లు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్​లో భువనగిరి పార్లమెంట్​ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన 400 మంది మైక్రో అబ్జర్వర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా మైక్రో అబ్జర్వర్లు కృషి చేయాలన్నారు. దికలు జనరల్ అబ్జర్వర్ కు నేరుగా పంపాలని సూచించారు.