టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టాయి. షీల్డ్ ఆఫ్ జూడా పేరుతో 2026, ఫిబ్రవరి 28న జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఇరాన్‌పై మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సిటీతో పాటు ముఖ్య నగరాల్లో భీకర దాడులకు పాల్పడ్డాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ, ఇరాన్ అధ్యక్ష భవనాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేశాయి.
అమెరికా, ఇజ్రాయెల్ ఆకస్మిక దాడులతో ఇరాన్ అప్రమత్తమైంది. ఆ రెండు దేశాల టార్గెట్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కావడంతో అతడిని వెంటనే రహస్య ప్రదేశానికి తరలించాయి ఇరాన్ భద్రతా దళాలు. అత్యంత సేఫ్‌గా ఉండే బంకర్లోకి ఖమేనీని తరలించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ ఆపరేషన్ మెయిన్ టార్గెట్ ఖమేనీనే అని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
►ALSO READ | ఇరాన్‌పై యుద్ధంతో ఇజ్రాయెల్ లాక్ డౌన్.. ఎయిర్ స్పేస్‌తో సహా అన్నీ మూసివేత
దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను ఖమేనీ పట్టించుకోకపోవడమే. ఖమేనీ ఇరాన్ వదిలిపోవాలని.. లేదంటే ఖమేనీతో పాటు అతడి ఫ్యామిలీని వదలం అని ట్రంప్ హెచ్చరించాడు. కానీ ఖమేనీ ట్రంప్ బెదిరింపులకు లొంగలేదు. దీంతో ఖమేనీని అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక.. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో తమ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, రక్షణ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ సురక్షితంగా ఉన్నారని ఇరాన్ అధికారులు ధృవీకరించారు.
