ఇరాన్ పై యుద్ధం మొదలుపెట్టింది ఇజ్రాయెల్. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సిటీ టార్గెట్ గా.. నార్త్ అండ్ సౌత్ ఏరియాల్లోని 50 చోట్ల బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. ఇరాన్ పై తీవ్ర స్థాయిలో.. ఏకపక్షంగా యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్.. అదే స్థాయిలో తన దేశాన్ని రక్షించుకునేందుకు యాక్షన్ ప్లాన్ ప్రకటించింది.
- ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసే అవకాశం ఉండటంతో ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
- దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది.
- ఇరాన్ ప్రతీకారంగా దాడులకు దిగటం ఖాయం.. అది జరుగుతుంది అనేది కన్ఫామ్ అయిన క్రమంలో.. ఇజ్రాయెల్ ముందస్తు జాగ్రత్తలు ప్రకటించింది. దేశాన్ని లాక్ డౌన్ చేసింది.
- ఇరాన్ నుంచి వచ్చే యుద్ధ విమానాలు, మిస్సైల్స్, రాకెట్లను అడ్డుకునేందుకు.. వాటిని గాల్లోనే ఢీ కొట్టేందుకు.. ప్రయాణికుల విమనాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు.. అత్యవసరంగా ఎయిర్ స్పేస్ మూసివేసింది. ఈ ఎయిర్ స్పేస్ మూసివేతతో.. ఇజ్రాయెల్ దేశం పరిధిలో.. ఆకాశంలో ఎలాంటి విమానాలు తిరగటానికి అనుమతి ఉండదు.. ఒక వేళ ఇజ్రాయెల్ దేశం పరిధిలోకి విమానాలు వస్తే వాటికి రాడార్ సిగ్నల్స్ అందవు.. శత్రువు విమానంగా భావించి.. వాటిని ఇజ్రాయెల్ కూల్చివేస్తుంది.
- ఇక ఇజ్రాయెల్ దేశం మొత్తం స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నింటిని మూసివేశారు.
- ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు అన్నింటిని మూసివేసి.. సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.
- ప్రజలు ఎవరూ రోడ్లపైకి రావొద్దని ఆదేశించింది ఇజ్రాయెల్ సర్కార్. జనం అంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచించింది.
- అత్యవసర సేవల కోసం బయటకు వచ్చినవాళ్లు.. ఏమైనా అనుమానం ఉన్నా.. దాడులు జరిగే ప్రమాదం ఉందని గ్రహించినా.. వెంటనే సమీపంలోని బంకర్లలోకి వెళ్లాలంటూ సైరన్లు మోగించింది ఇజ్రాయెల్ ప్రభుత్వం.
- మరోవైపు.. ఇరాన్ ప్రతిదాడులకు పూర్తి సంసిద్ధంగా ఉండాలని సైన్యాన్ని ఆదేశించింది.
- దేశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసింది.
