ప్రధాని మోదీ ఇంటి ముందు టెన్షన్ టెన్షన్.. భారీగా చేరుకుంటున్న పోలీసులు

ప్రధాని మోదీ ఇంటి ముందు టెన్షన్ టెన్షన్.. భారీగా చేరుకుంటున్న పోలీసులు

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి దగ్గరకు పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. కాక్రోచ్ పార్టీ నిరసనకారులపై లాఠీఛార్జ్ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముట్టడికి యత్నించింది. ప్రధాని మోదీ ఇంటి దగ్గరలో మెరుపు ధర్నాకు దిగింది.

#WATCH | Delhi: Congress leaders including party president Mallikarjun Kharge, Lok Sabha LoP Rahul Gandhi, Priyanka Gandhi Vadra, KC Venugopal, Pawan Khera and others hold a protest at Lok Kalyan Marg, demanding the resignations of Prime Minister and Education Minister Dharmendra… pic.twitter.com/6YOl99JZ6l

— ANI (@ANI) July 21, 2026

ఈ ధర్నాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే భాగమై ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

చేతులకు తాళ్లు కట్టుకుని ప్రభుత్వ తీరును, పోలీసుల తీరును కాంగ్రెస్ నేతలు ఎండగట్టారు. ప్రధాని మోదీ, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నిరసనలో భాగమైన కాంగ్రెస్ ప్రముఖ నేతలంతా చేతులకు తాళ్లు కట్టుకుని ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, గొంతెత్తితే బేడీలు వేసి బంధిస్తుందని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

#WATCH | Delhi: Paramilitary Force reaches Lok Kalyan Marg, where Congress leaders are holding a protest demanding the resignations of Prime Minister and Education Minister Dharmendra Pradhan. pic.twitter.com/T8uXSJd8oy

— ANI (@ANI) July 21, 2026

విద్యాశాఖ మంత్రిగా ఫెయిలైన ధర్మేంద్ర ప్రధాన్తో కనీసం రాజీనామా చేయించలేని అసమర్థ ప్రధాని మోదీ అని రాహుల్​ఎద్దేవా చేశారు. దేశంలో 152 సార్లు పేపర్లు లీకై, 7.5 కోట్ల మంది విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారినా ఒక్క దోషికి శిక్ష పడలేదని మండిపడ్డారు.

చదువు, భవిష్యత్తుపై న్యాయమైన ప్రశ్నలు అడిగితే లాఠీదెబ్బలు, అరెస్టులు బహుమతిగా ఇస్తున్నారని ధ్వజమెత్తారు. పేపర్లు లీక్ నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతుంటే, న్యాయం కోసం గొంతెత్తిన విద్యార్థులను చితక్కొడుతున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.