భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్–2 (ఏఈసీఎస్–2) లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: లోయర్ డివిజన్ క్లర్క్ (అడ్ హక్).
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్లో కనీసం 50% మార్కులు లేదా సమాన సీజీపీఏ సాధించి ఉండాలి.
టైపింగ్ నైపుణ్యం: కంప్యూటర్‌పై ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి కనీసం 35 పదాల (డబ్ల్యూపీఎం) వేగం కలిగి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ఇన్ స్కిల్ టెస్ట్: జులై 27.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.aecshyd2.edu.inను సందర్శించండి.
