- ఎంపీ అనిల్ కుమార్ ప్రశ్నకు రాజ్యసభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: వరంగల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ వెల్లడించారు. జీఎస్టీతో కలిపి రూ.496.86 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు ఏఏఐ అనుమతి ఇచ్చిందని తెలిపారు.
భూసేకరణ ప్రక్రియ పూర్తికావడం, చట్టబద్ధమైన, విధిగా పొందాల్సిన కేంద్ర అనుమతులు లభించడం, ఆర్థిక వనరుల సమకూర్పుతో పాటు స్థానిక సాంకేతిక అంశాలపై ఎయిర్‌పోర్ట్ ప్రారంభ గడువు ఆధారపడి ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ మేరకు ఎంపీ అనిఈల్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేసి, రవాణా సేవలను ప్రారంభించేందుకు (ఆపరేషనలైజేషన్) నిర్దిష్ట కాలపరిమితి అనేది పలు కీలక అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు.
