పాకిస్తాన్ ఫైటర్ జెట్ ను కూల్చిన ఆఫ్ఝన్ మిలిటరీ.. సైన్యానికి చిక్కిన పైలట్

పాకిస్తాన్ ఫైటర్ జెట్ ను కూల్చిన ఆఫ్ఝన్ మిలిటరీ.. సైన్యానికి చిక్కిన పైలట్

పాకిస్తాన్ కుచెందిన యుద్ద విమానాన్ని కూల్చివేసినట్లు ఆప్ఘన్ మిలిటరీ కూల్చివేసింది..పైలట్ సజీవంగా మిలిటరీకి పట్టుబడ్డాడని  ఆప్ఘన్ మిలిటరీ  ప్రకటించింది తూర్పు ఆప్ఘనిస్తాన్ లోని జలాలాబాద్ లోని యుద్ద విమానాన్ని కూల్చివేశారు. పైలట్ పారాచూట్ ద్వారా దిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. 

ఆఫ్ఘన్ సైన్యం ప్రకటన ప్రకారం..ఆ యుద్ధవిమానం గగనతలంలోనే లక్ష్యంగా చేసుకుని కూల్చేవేశారు. విమానం కూలే సమయంలో పైలట్ పారాచూట్ సాయంతో బయటకు దూకినట్లు తెలిపారు. భూమికి దిగిన వెంటనే అతడిని సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ సైనిక ప్రతినిధి వహిదుల్లా మొహ్మది ధృవీకరించారు. పైలట్ సజీవంగా పట్టుబడ్డాడని అన్నారు. 

తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా స్థావరంగా ఉన్న కాబూల్, కాందహార్‌లపై శుక్రవారం పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. శనివారం మరోసారి తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లోని జలాలాబాద్ లో ఫైటర్ జెట్లు దాడులు చేశాయి. దీంతో పాక్ , ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.  
 

►ALSO READ | రహస్య ప్రదేశంలోకి ఇరాన్ సుప్రీం ఖమేనీ: ఎక్కడున్నా వదలం అంటున్న ఇజ్రాయెల్, అమెరికా