నల్లగొండ జిల్లాలో రూ.15 లక్షల బంగారం పోగొట్టుకున్న మహిళ.. గంటల వ్యవధిలో రికవరీ

నల్లగొండ జిల్లాలో రూ.15 లక్షల బంగారం పోగొట్టుకున్న మహిళ.. గంటల వ్యవధిలో రికవరీ

బంగారం ధరలు భారీగా పెరిగి పోవడంతో బ్యాంకులో భద్రపరుచుకుందామని వెళ్లిన మహిళ.. దాదాపు 15 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు పోగొట్టుకుంది. శుక్రవారం (ఫిబ్రవరి 27)   నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో  9 తులాల బంగారాన్ని పోగొట్టుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. 

 పైలాన్ లోని ఎస్బీఐ బ్యాంకులో నగలు భద్రపరిచేందుకు వెళ్లి పోగొట్టుకున్నట్లు మహిళ ఫిర్యాదు చేసింది.  బాధితురాలు ఫిర్యాదుతో ఎత్తుకెళ్లిన మహిళ నుంచి 24 గంటల్లో నగలను రికవరీ చేశారు  పోలీసులు. మిర్యాలగూడ డీఎస్పి రాజశేఖర్ రాజ్ చేతుల మీదుగా బాధితులకు నగలు అప్పగించారు. నగలు పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన  సిబ్బందిని  డి.ఎస్.పి. అభినందించారు.