వాళ్లు యుద్ధం మొదలుపెట్టారు.. మేం యుద్ధాన్ని ముగిస్తాం.. యుద్ధం ముగింపు ఎలా ఉంటుందో చూపిస్తాం.. మేం తగ్గేదేలా.. యుద్ధాన్ని ఏ విధంగా ముగిస్తామంటే.. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఏడుస్తాయి.. మా సత్తా ఏంటో చూపిస్తాం.. మా పవర్ ఏంటో రుచి చూపిస్తాం.. యుద్ధం ఎందుకు మొదలుపెట్టామా అని ఆ రెండు దేశాలు బాధపడతాయి.. ఆ విధంగానే ఉంటుంది మా ప్రతీకారం అంటూ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్.
ఇరాన్ దేశ రాజధాని టెహ్రాన్ సిటీపై వరుస దాడులతో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత.. ఇరాన్ ఫస్ట్ టైం స్పందించింది. యుద్ధాన్ని మొదలుపెట్టిన వాళ్లకు.. ముగింపు కూడా ఉంటుందని.. ఆ ముగింపు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం అంటూ ఇరాన్ ఆర్మీ అధికారులు ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులను పిరికపంద చర్యగా అభివర్ణించింది ఇరాన్.
►ALSO READ | పాకిస్తాన్ ఫైటర్ జెట్ ను కూల్చిన ఆఫ్ఝన్ మిలిటరీ.. సైన్యానికి చిక్కిన పైలట్
దొంగచాటుగా దెబ్బ తీయడం కాదని.. నేరుగా తలపడాలని చురకలంటించింది. నేరుగా రంగంలోకి దిగి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో మేం చూపిస్తామని రెండు దేశాలను హెచ్చరించింది. చడిచప్పుడు కాకుండా మమ్మల్ని దెబ్బ తీసినా అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు మా ప్రతీకార దాడులకు కూడా సిద్ధం కావాలని ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది.
ఇక.. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో తమ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, రక్షణ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ సురక్షితంగా ఉన్నారని ఇరాన్ అధికారులు ధృవీకరించారు. సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకోబోతుండటంతో ప్రపంచ దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
