యుద్ధ ప్రాతిపాదికన రామస్వామి గుట్ట ఇండ్ల నిర్మాణ పనులు : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

యుద్ధ ప్రాతిపాదికన రామస్వామి గుట్ట ఇండ్ల నిర్మాణ పనులు : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

హుజూర్ నగర్,వెలుగు: మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల కాలనీని ప్రారంభించనున్నందున యుద్ధ ప్రాతిపాదికన ఇండ్ల నిర్మాణ ముగిం పనులుకొనసాగుతున్నాయని  కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.శుక్రవారం హుజూర్ నగర్ లోని రామస్వామి గుట్ట వద్ద  ఇందిరమ్మ ఇండ్ల ను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ మాట్లాడుతూ  ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్  పనులను త్వరితగతిన  పూర్తి చేయాలని,అవసరమైతే  ఎక్కువ మంది లేబర్ ను తీసుకొని పనులు పూర్తి చేసి మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా  లబ్ధిదారులకు అందించడానికి  సిద్ధం చేయాలని అన్నారు .

బ్లాక్ లో మధ్య గల  అంతర్గత రోడ్లు,డ్రైనేజీ వ్యవస్థ,విద్యుత్ సరఫరా, మొక్కలు నాటడం,పెయింటింగ్ పనులు,స్ట్రీట్ లైట్స్ మొదలైన అన్ని   పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.  కార్యక్రమంలో  హౌసింగ్ పిడి సిద్ధార్థ, మిషన్ భగీరథ ఇ.ఇ. కరుణాకర్ రెడ్డి, తాసిల్దార్ కవిత పాల్గొన్నారు.