మోదీ మహిళా పక్షపాతి : బండి సంజయ్

మోదీ మహిళా పక్షపాతి : బండి సంజయ్
  •     బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్

కరీంనగర్, వెలుగు : ప్రధాని నరేంద్రమోదీ మహిళల పక్షపాతి అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొనియాడారు. శుక్రవారం కరీంనగర్ లో నిర్వహించిన బీజేపీ అనుబంధ మోర్చా మహిళా శక్తి సమ్మేళనంలో బండి సంజయ్ మాట్లాడుతూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో మోదీ కృషి చేస్తున్నారన్నారు. కేసీఆర్ పాలన అంటే  మద్యం, అత్యాచారాలు, హత్యలు మాత్రమే గుర్తొచ్చేవన్నారు.

అవినీతి, అరాచకాల్లో బీఆర్ఎస్ నేతలు గుడిని మింగితే.. కాంగ్రెస్  లీడర్లు గుడిలో లింగాన్ని కూడా మింగే రకమన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌‌ విస్మరించిందని మండిపడ్డారు. ‘బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి  వెలిచాల రాజేందర్ ఎప్పుడైనా కనిపించారా? లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ రూ.వందల కోట్లు ఖర్చు పెట్టి..

గెలిచాక  కోట్లు దండుకుందామని ప్లాన్ చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్ప, లీడర్లు నళిని, చొప్పరి జయశ్రీ, సుధ, పద్మ 
తదితరులు పాల్గొన్నారు. 

బీజేపీలో చేరికలు 

కరీంనగర్ సిటీ/చొప్పదండి, వెలుగు : పార్లమెంటు ఎన్నికల సమీపిస్తున్న వేళ కరీంనగర్ బీజేపీలో చేరికలు జోరు గా సాగుతున్నాయి.  శుక్రవారం కరీంనగర్ ఎంపీ ఆఫీసులో బండి సంజయ్ కుమార్ సమక్షంలో  కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల మండలాలు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల లీడర్లు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.

చొప్పదండి, కొత్తపల్లి మండలాల్లోని పలువురు లీడర్లు బీజేపీలో చేరారు. చేరినవారిలో చొప్పదండి లీడర్‌‌‌‌ గుర్రం ఆనందరెడ్డి, ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత, గాలి రవి యాదవ్, బద్దేపల్లి మాజీ ఉప సర్పంచ్ చరణ్ కుమార్, మహిపాల్​రెడ్డి, బీఆర్​ఎస్​ సోషల్​ మీడియా కన్వీనర్​ ప్రశాంత్​తదితరులు ఉన్నారు.