క్రీడలతో మానసిక ఉల్లాసం : విప్ ఆది శ్రీనివాస్

క్రీడలతో మానసిక ఉల్లాసం : విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం కలుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని రెడ్డికాలనీలో నిర్వహిస్తున్న శాంతి నగర్ ప్యారిస్ క్రికెట్ లీగ్–2025  క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్​ మాట్లాడుతూ వేములవాడ, సిరిసిల్ల ప్రాంతం క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని, రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.  అంతకుముందు పట్టణంలోని బాలనగర్‌‌‌‌‌‌‌‌లో పూర్తయిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కొత్త బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

కోనరావుపేట, వెలుగు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామంలో కొత్తగా నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించారు. అంతకుముందు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానం ముందుకు తీసుకోపోవాలని సూచించారు. 

వేములవాడ నియోజకవర్గాన్ని, కోనరావుపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. మల్కపేట రిజర్వాయరు మెయిన్ కెనాల్ ద్వారా ఎల్లారెడ్డిపేట నియోజకవర్గంలో సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌‌‌‌రెడ్డి, ఏఎంసీ  చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ అనూష, సింగిల్ విండో చైర్మన్ నరసయ్య, లీడర్లు గొట్టె రుక్మిణి, ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, అనిల్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.