మంచిర్యాలలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు కూలీలు మృతి

మంచిర్యాలలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు  కూలీలు మృతి

మంచిర్యాల జిల్లా  జైపూర్ మండలంలో డిసెంబర్ 22న ఉదయం  రోడ్డు ప్రమాదం జరిగింది.  ఇందారం ఎక్స్ రోడ్ దగ్గర  కూలీలతో వెళ్తోన్న బొలెరో వాహనాన్ని లారీ ఢీ కొట్టింది.  ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

మహారాష్ట్రకు చెందిన కూలీలు నాట్లు వేయడానికి  కరీంనగర్ లోని  సుల్తానాబాద్ కి బొలెరో వాహనంలో వస్తుండగా వెనుక నుంచి వస్తోన్న లారీ ఢీ కొట్టడంతో  ఈ ప్రమాదం  జరిగింది.  ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో 22 మంది కూలీలు  ఉన్నారు.  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  మృతదేహాలను పోస్టుమార్టం కోసం  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.