ప్లాస్మా థెరపీ తో కోలుకుంటున్న సంకేతాలు

ప్లాస్మా థెరపీ తో కోలుకుంటున్న సంకేతాలు

హ్యూస్టన్ : కరోనాకు ట్రీట్ మెంట్ లో ప్లాస్మా థెరపీ విధానానికి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. హ్యూస్టన్ లో కరోనా బారిన పడిన ముగ్గురు ఇండియన్స్ కు ప్లాస్మా ట్రీట్ మెంట్ ఇవ్వటంతో వారిలో కోలుకుంటున్న సంకేతాలు కనిపించాయి. బేలార్ సెయింట్ ల్యూక్ సెంటర్ లో వీరికి కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ పద్దతి లో వైద్యం అందిస్తున్నారు. ఈ మధ్యే కరోనా తీవ్రత పెరగటంతో రోహన్ బవడేర్, లవంగ వెలుస్వామి, సుష్మసింగ్ లు సెంట్ లూక్స్ హాస్పిటల్ లో చేరారు. పరిస్థితి విషమించటంతో డాక్టర్లు ప్లాస్మా డోనర్ల ద్వారా ట్రాన్స్ ఫ్యూజన్ లో ట్రీట్ మెంట్ షురు చేశారు. దీంతో వీరు క్రమంగా కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పారు. కరోనా కు మందులేకపోవటంతో ప్రస్తుతం ప్లాస్మా థెరపీ తోనే ఎక్కువ ట్రీట్ మెంట్ చేస్తున్నారు. ఈ విధానంలో కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ రక్తం నుంచి ప్లాస్మా సేకరిస్తారు. అందులోని యాంటీ బాడీలను కరోనా పేషెంట్లకు ఎక్కిస్తారు. యాంటీ బాడీలో రక్తం లోకి వెళ్లి కరోనా వైరస్ తో ఫైట్ చేస్తాయి. ఐతే ప్లాస్మా థెరపీ లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే డోనర్స్ అవసరం ఉంటుంది.