అజ్మర్దా మందు ధర 50 శాతం తగ్గింపు

అజ్మర్దా మందు ధర 50 శాతం తగ్గింపు

హైదరాబాద్​, వెలుగు: ఫార్మాస్యూటికల్ కంపెనీ జేబీ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (జేబీ ఫార్మా)  క్రిటికల్ హార్ట్ ఫెయిల్యూర్ డ్రగ్ "అజ్మర్దా" ధరను సుమారు 50 శాతం తగ్గించింది. దేశంలో  8 నుండి 12 మిలియన్ల మంది హార్ట్ ఫెయిల్యూర్​తో ఇబ్బందిపడుతున్నారని వెల్లడించింది. సకుబుట్రిల్-వల్సార్టన్ ️ అనే పేటెంట్ మాలిక్యూల్​తో అజ్మర్దా తయారవుతుంది.  అజ్మర్డా 50 ఎంజీ ట్యాబ్లెట్​ ధర గతంలో రూ. 78 కాగా, ఇప్పుడు ఇది రూ. 39.60లకు అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా జేబీ ఫార్మా డొమెస్టిక్ బిజినెస్ ప్రెసిడెంట్ దిలీప్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ, " అజ్మర్దా ట్యాబ్లెట్లను మరింత అందుబాటు ధరలో తీసుకురావాలని నిర్ణయించాం.    

ధరల తగ్గింపు వల్ల నెలవారీ చికిత్స ఖర్చు రూ. 4500 నుండి రూ. 2200 లకు తగ్గుతుంది.  ఆసుపత్రిలో చేరే ఖర్చును  కనీసం రూ.లక్ష వరకు తగ్గించవచ్చు. హార్ట్​ ఫెయిల్యూర్​ చాలా డేంజర్. దీని గురించి అవగాహన పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం.  జేబీ ఫార్మా దేశవ్యాప్తంగా 300 లకుపైగా ‘హార్ట్ ఫెయిల్యూర్’ క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కూడా ఏర్పాటు చేసి రోగులకు అవగాహన కలిగిస్తుంది.  దీనివల్ల తగిన నిర్ణయాలు తీసుకుంటారు”అని ఆయన వివరించారు. సకుబుట్రిల్-వల్సార్టన్ మాలిక్యూల్​పై​ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌‌‌‌లోని నోవార్టిస్  ఏజీకి పేటెంట్​ ఉంది.  జేబీ ఫార్మా రూ. 246 కోట్లతో భారతదేశ ప్రాంతం కోసం నోవార్టిస్  నుండి అజ్మర్దా బ్రాండ్‌‌‌‌ను ఈ ఏడాది ఏప్రిల్​లో కొనుగోలు చేసింది.