ఐక్యరాజ్యసమితికి అయిదో తరగతి బాలుడి భావోద్వేగ లేఖ

ఐక్యరాజ్యసమితికి అయిదో తరగతి బాలుడి భావోద్వేగ లేఖ

కొత్తగా సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో తన రాష్ట్రంలో జరుగుతున్న హింస గురించి ఐదవ తరగతి బాలుడు ఐక్యరాజ్యసమితికి లేఖ రాశాడు. అస్సాంలోని గువహతికి చెందిన డాన్ బాస్కో పాఠశాల విద్యార్థి యశ్వీర్ ఆలం అస్సాంలో పూర్వపు స్థితి వచ్చేలా చూడాలని కోరుతూ UN సెక్రటరీ జనరల్‌కు బహిరంగ లేఖ రాశాడు.

‘నేను గువహతిని ఇలా చూడటం ఇదే మొదటిసారి. నా మాతృభూమి అస్సాం జరుగుతున్న అల్లర్లను చూస్తే నా గుండె ఏడుస్తోంది. అయ్యా, మా ప్రజల గొంతు ఎవ్వరూ వినడం లేదు … నా సంతోషకరమైన జీవితాన్ని తిరిగి కోరుకుంటున్నాను. నిరసనల వల్ల నేను వీకెండ్ సినిమాను మరియు కేఎఫ్‌సీ ట్రీట్‌ను కొల్పోయాను. మా భాద వినడానికి ఎవరూ లేనందున మేము నిస్సహాయంగా ఉన్నాం’ అంటూ ఆ బాలుడు UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు ఇమెయిల్ చేశాడు. అందులో పోలీసుల క్రూరత్వానికి సంబంధించిన సంఘటనలను కూడా ప్రస్తావించాడు. పోలీసులు నిరసనకారులపై టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులు మరియు రబ్బరు బుల్లెట్ల వాడడం వల్ల ఐదుగురు పౌరులు మరణించినట్లు బాలుడు లేఖలో రాశాడు. తాను స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ప్రజల నిరసనలు మరియు వారిపై పోలీసు కాల్పుల ఘటనలను చూశానని యశ్వీర్ తెలిపాడు. ఆ ఘటనలే తనను ఈ లెటర్ రాసేలా ప్రేరేపించాయని తెలిపాడు. తాను UN గురించి తన పుస్తకంలో చదివానని, ఒక అంకుల్ సలహా మేరకు తాను ఈ లెటర్ రాశానని యశ్వీర్ తెలిపాడు.

యశ్వీర్ తల్లి అఫ్రిదా హుస్సియాన్ మాట్లాడుతూ.. ‘నేను యశ్వీర్‌కు మెయిల్ ఐడీ లేనందున నా మెయిల్ ఐడీ నుంచి ఆ లెటర్ పంపేలా సహాయం చేశాను. ఆ తర్వాత యశ్వీర్‌కు కొత్త ఈమెయిల్ ఖాతాను తెరిపించి ఇచ్చాను’ అని అన్నారు.

ముస్లిం ప్రాబల్యం ఉన్న బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ దేశాల మైనారిటీలు మతపరమైన హింస కారణంగా డిసెంబర్ 31, 2014కు ముందు భారతదేశానికి వస్తే వారికి పౌరసత్వం ఇవ్వడానికి ఈ చట్టం సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.

దారుణం: చెట్టుకు కట్టేసి కొట్టి.. నోట్లో మూత్రం పోసి..