
- కొత్త ప్రభుత్వం రాగానే చేపడతామన్న డీపీఐఐటీ సెక్రెటరీ
- వరల్డ్ బ్యాంక్ సర్వేపై పనిచేస్తున్నామని వెల్లడి
న్యూఢిల్లీ : కొత్త ప్రభుత్వం వచ్చాక కొన్ని సెక్టార్లలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ( ఎఫ్‌డీఐ ) రూల్స్ సులభతరం అవుతాయని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నెట్ ట్రేడ్ ( డీపీఐఐటీ) సెక్రెటరీ రాజేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా చాలా సెక్టార్లలో ఎఫ్‌డీఐ పాలసీలను ప్రభుత్వం లిబరలైజ్ (సరళీకరించడం) చేసిందని పేర్కొన్నారు. తాజాగా స్పేస్ సెక్టార్‌లో ఎఫ్‌డీఐ రూల్స్‌ను ప్రభుత్వం సులభతరం చేసిన విషయం తెలిసిందే.
శాటిలైట్ల కాంపోనెంట్ల తయారీని పెంచేందుకు 100 శాతం విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లకు అవకాశం కల్పించింది. ప్రపంచంలోనే ఎఫ్‌డీఐ పాలసీలను లిబరైజ్ చేసిన దేశాల్లో ఇండియా ముందుంటుందని, సౌత్ఈస్ట్ ఆసియాలో టాప్‌లో ఉందని ఢిల్లీలో జరిగిన సీఐఐ యాన్యువల్ బిజినెస్ సమ్మిట్‌లో రాజేష్ పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 4 న వెలువడనున్నాయి. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది.
కిందటేడాది ఏప్రిల్– డిసెంబర్ మధ్య 32.03 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు ఇండియాలోకి వచ్చాయి. అంతకు ముందు ఏడాది ఇదే టైమ్‌తో పోలిస్తే ఇవి 13 శాతం తక్కువ. కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్, టెలికం, ఆటో, ఫార్మా సెక్టార్లలోకి ఎఫ్‌డీఐలు తగ్గాయి.
పీఎల్‌ఐ గ్రాండ్ సక్సెస్
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్ సక్సెస్ గురించి రాజేష్ మాట్లాడారు. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద రూ.1.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, పీఎల్ఐ బెనిఫిట్స్ పొందిన కంపెనీలు రూ.9 లక్షలకు పైగా విలువైన సేల్స్ నమోదు చేశాయని వివరించారు. రూ.3.45 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు జరిపాయని, 8 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాయని అన్నారు. పీఎల్‌ఐ స్కీమ్‌ను 14 సెక్టార్ల కోసం 2021 లో ప్రకటించారు. టెలికమ్యూనికేషన్, వైట్ గూడ్స్, టెక్స్‌టైల్స్, మెడికల్ డివైజ్‌ల తయారీ, స్పెషాలిటీ స్టీల్, ఫుడ్ ప్రొడక్ట్‌లు, సోలార్ పీవీ మాడ్యుల్స్
అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్లు, ఫార్మా వంటి సెక్టార్లలో పీఎల్‌ఐ స్కీమ్‌ను అమలు చేస్తున్నారు. రాయితీల కింద పెట్టుబడులు పెట్టే కంపెనీలకు రూ.1.97 లక్షల కోట్ల విలువైన బెనిఫిట్స్‌ను ప్రభుత్వం ఇవ్వనుంది. ఈజ్ ఆఫ్డూయింగ్ బిజినెస్‌ను పెంచేందుకు వరల్డ్ బ్యాంక్ బిజినెస్ రెడీ (బీ–రెడీ) ఇండెక్స్‌పై పనిచేస్తున్నామని రాజేష్ పేర్కొన్నారు. ఈ సర్వే ఆగస్టులో మొదలవుతుంది. బిజినెస్‌లు ఎంట్రీ ఇవ్వడం
ఎగ్జిట్ కావడం, కార్యకలాపాలను ఈజీగా జరుపుకోవడం వంటి కొన్ని కొత్త ఇండెక్స్‌ల ఆధారంగా ర్యాంకింగ్‌ను వరల్డ్ బ్యాంక్ ఇవ్వనుంది. మొత్తం 1,370 ప్రశ్నలపై బిజినెస్‌ల అభిప్రాయాలను సేకరించనుంది. డీపీఐఐటీ, ఇతర మినిస్ట్రీలు కలిసి సెప్టెంబర్‌లో సర్వే నిర్వహిస్తాయని, పరిస్థితులను అర్థం చేసుకొని అవసరమైన సంస్కరణలు తీసుకొస్తామని రాజేష్ అన్నారు.