సూర్యాపేట, వెలుగు: పైసా ఇస్తే చాలు.. ఐదు నిమిషాల్లో ఒరిజినల్ కార్డును తలదన్నేలా డూప్లికేట్ కార్డు సృష్టించే కేటుగాళ్ల ముఠా గుట్టురట్టయింది.
ఆర్టీఏ ఏజెంట్లతో చేతులు కలిపి, దొంగతనానికి గురైన వాహనాలకు నకిలీ ఆర్సీలు సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠా సభ్యులు సంతోష్, యాకుబ్ పాషాను సూర్యాపేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
సత్యం నెట్ జోన్ పేరుతో ఇంటర్నెట్ సెంటర్ నడుపుతూ దాని చాటూ ఈ నకిలీ కార్డులని తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది.
