పుణే అభ్యర్థి సైకిల్ పై రోజూ 60 కి.మీ ఎన్నికల ప్రచారం

పుణే అభ్యర్థి సైకిల్ పై రోజూ 60 కి.మీ ఎన్నికల ప్రచారం
  • రోజూ 60 కిలోమీటర్లు తిరుగుతున్న ఆనంద్ వంజపే
  • పొల్యూషన్ ఫ్రీ పుణే కోసం లోక్ సభ ఎన్నికల్లో పోటీ

పుణే: ఎన్నికల ప్రచారం అంటే రాజకీయపార్టీలన్నీ భారీ బహిరంగ సభలు.. రోడ్​ షోలపైనే ఆధారపడతాయి. కానీ, పుణేకి చెందిన ఆనంద్ వంజపే(43) మాత్రం కాస్త డిఫరెంట్ . సైకిల్​పైనే తిరుగుతూ ఓట్లడుగుతున్నాడు. ఏ ఒకట్రెండు కిలోమీటర్ల దూరంకాదు.. రోజుకు సుమారు 60 కిలోమీటర్లు సైకిల్​ తొక్కుతూ క్యాంపెయిన్​ చేస్తున్నాడు.పుణే లోక్ సభ సెగ్మెంట్​ నుంచి ఆనంద్ ఇండిపెం డెంట్​గా పోటీ చేస్తున్నాడు. అతని అజెండా పుణేని పొల్యూషన్​ లేని నగరంగా మార్చడమే. తనను తాను ఎన్వి రాన్మెంట్ పొలిటీషియన్​గా చెప్పుకునే ఆనంద్ గత కొన్నేళ్లుగా పొల్యూషన్​ ఫ్రీ లైఫ్ స్టైల్​ కోసం క్యాంపెయిన్​ చేస్తున్నాడు. ఇప్పుడు దానినే తన ఎలక్షన్​ అజెండాగా మార్చుకున్నాడు. ఆనంద్ ప్రచారానికి అతని ఫ్రెండ్స్​ సపోర్ట్​గా నిలుస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా క్యాం పెయిన్​ చేయడమే కాక అతనికి కావాల్సిన ఫండ్స్​ కూడా సమకూరుస్తున్నారు. లోకల్​ బాడీ,అసెంబ్లీ ఎన్నికల్లో కాకుండా లోక్ సభ ఎన్నికల్లోనే ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించగా.. పొల్యూషన్​ సిటీకో.. ప్రాంతానికో పరిమితమైన అంశం కాదని, దీ నిపై నేషనల్​ పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉందని, అది పార్లమెంట్​ స్థాయిలోనే సాధ్యమవుతుందని, అందుకే తాను లోక్ సభకు పోటీ చేస్తున్నట్టు ఆనంద్ చెప్పాడు.