
కుత్బుల్లాపూర్ సుచిత్రా పరిధిలోని 82 సర్వే నంబర్ లోగల వివాదాస్పద 1.6 ఎకరాల భూమిలో సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే తమ దగ్గరున్న డాక్యుమెంట్స్ ను అధికారులకు ఇరువర్గాల వారు సమర్పించారు. కుత్బుల్లాపూర్ రెవెన్యూ శాఖ అధికారులు సర్వే కోనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భారీగా పోలీసులు మొహరించారు. భూమి తమదంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి శనివారం వచ్చి బారికెడ్లను కూల్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ రెవెన్యూ శాఖ అధికారులు సర్వే చేస్తున్నారు. అప్పటికే మల్లారెడ్డి తన అనుచరులతో భూమి వద్దకు వచ్చారు. ఇటు మరో 15 మందితో కూడిన వర్గం సైతం వచ్చి పరిశీలిస్తున్నారు. ఇరువర్గాల సమక్షంలోనే సర్వే చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇదే వివాదం పైన సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మల్లారెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నట్టు సమాచారం.