కామారెడ్డి జిల్లా: బాన్సువాడలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. SBI బ్యాంక్ నుంచి 8 లక్షలు డ్రా చేసి రిలయన్స్ మార్కెట్కు మాధవరావు అనే వ్యక్తి వెళ్లాడు. కారులో డబ్బులు పెట్టి రిలయన్స్ మార్కెట్లోకి మాధవరావు వెళ్లడాన్ని పక్కా రెక్కీ చేసిన దొంగలు గమనించారు. కారు అద్దాలు పగుల కొట్టి 8 లక్షల రూపాయల డబ్బును దొంగలు ఎత్తుకెళ్లారు.
రిలయన్స్ మార్కెట్లో నుంచి బయటకు వచ్చి చూసేసరికి కారు అద్దాలు పగలగొట్టి ఉండటాన్ని మాధవ రావు గమనించాడు. కారు లోపల డబ్బులు లేవన్న విషయం గ్రహించి లబోదిబోమని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం జరిగిన స్పాట్లో సీసీ కెమెరాలను చెక్ చేశారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దొంగల కోసం పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారు.
