
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay)ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభు(Venkat Prabhu)తో G.O.A.T(Greatest Of All Time) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసందే.పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో విజయ్ తండ్రి కొడుకులుగా కనిపించనున్నాడని టాక్. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
లేటెస్ట్గా ఈ మూవీకి సంబంధించి వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తయినట్లు డైరెక్టర్ వెంకట్ ప్రభు పోస్ట్ చేశారు. అలాగే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ మూవీలో ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్ టెక్నాలజీ’ను ఉపయోగించి విజయ్ నుపాతికేళ్ల కుర్రాడిగా, పవర్‌ఫుల్‌గా చూపించనున్నారు మేకర్స్.
భారీ బడ్జెట్తో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు..‘అవతార్’, ‘అవెంజర్స్’లాంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ కి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన లోల కంపెనీ వీఎఫ్‌ఎక్స్ సాంకేతిక నిపుణులు పనిచేశారు.
Successfully completed the VFX work with @actorvijay na at @lolavfx can’t wait for the output!!! #TheGreatestOfAllTime #TheGOAT #aVPhero @archanakalpathi @aishkalpathi @hariharalorven pic.twitter.com/6BL29XOoXK
— venkat prabhu (@vp_offl) May 18, 2024
ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 5న వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి కారణంగా వరుస సెలవులు కలిసి వచ్చేలా G.O.A.T సినిమా రిలీజ్ సెట్ చేశారు మేకర్స్.దీంతో ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.మరి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాలో వైభవ్, ప్రేమి అమరెన్, యుగేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.