ఏఐతో పనిచేసే హ్యూమనైడ్‌‌‌‌ రోబో

ఏఐతో పనిచేసే హ్యూమనైడ్‌‌‌‌  రోబో

న్యూఢిల్లీ: ఆర్టిఫీషియల్‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో నడిచే హ్యూమనైడ్‌‌‌‌ (మనిషి రూపంలోని) రోబోను ఓ చైనీస్ కంపెనీ తమ సీఈఓగా నియమించుకుంది. ఏఐ వలన ఇప్పటికే వేల కొద్ది కింది స్థాయి ఉద్యోగాలు మెషిన్ల పరమవు తుంటే.. కంపెనీ బాస్‌‌‌‌ల ఉద్యోగాలు కూడా ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌లో రోబోల చేతికి చేరొచ్చని దీని బట్టి అర్థమవుతోంది.

 మెటావర్స్‌‌‌‌ కంపెనీ  ఫుజియన్‌‌‌‌ నెట్‌‌‌‌డ్రాగన్‌‌‌‌ వెబ్‌‌‌‌సాఫ్ట్‌‌‌‌ తాజాగా ఏఐతో పనిచేసే హ్యూమనైడ్‌‌‌‌  రోబో (పేరు ఎంఎస్‌‌‌‌ టాంగ్‌‌‌‌ యు) ని రోటేటింగ్‌‌‌‌ సీఈఓగా నియమించింది. కంపెనీ పని సామర్ధ్యాన్ని మరింత పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌లను క్రియేట్ చేసే ఈ కంపెనీ వాల్యూ సుమారు రూ. 80 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇంత పెద్ద కంపెనీని రోబో చేతిలో పెట్టడం విశేషం.