రైతుల కోసం రాజకీయ పార్టీలు ఏకతాటిపై రావాలి

రైతుల కోసం రాజకీయ పార్టీలు ఏకతాటిపై రావాలి

చండీగఢ్: బీజేపీతో దశాబ్దాలుగా కొనసాగుతున్న బంధాన్ని శిరోమణి అకాలీదళ్ తెంచుకుంది. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలియన్స్ (ఎన్డీఏ) నుంచి ఆదివారం అకాలీదళ్ తప్పుకుంది. ఈ నేపథ్యంలో రైతులు, వ్యవసాయ ఉత్పత్తి వ్యాపారుల శ్రేయస్సు దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై వచ్చి యునైటెడ్ ఫ్రంట్‌‌ను ఏర్పాటు చేయాలని అకాలీదళ్ పార్టీ ప్రెసిడెంట్ సుఖ్‌‌బీర్ సింగ్ బాదల్ పిలుపునిచ్చారు. ‘దేశంలోని రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ ఉత్పత్తి వ్యాపారుల బాగు కోసం అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు ఏకమై నిరసనలు తెలియజేయాలి. అకాలీదళ్ తన సిద్ధాంతాల నుంచి పారిపోదు. రైతుల శ్రేయస్సు కోసమే మేం ఎన్డీఏ నుంచి విడిపోయాం’ అని సుఖ్‌‌బీర్ ట్వీట్ చేశారు.