అతిపెద్ద హిందూ దేవాలయంపై అక్షయ్ కుమార్ ప్రశంసలు

అతిపెద్ద  హిందూ  దేవాలయంపై అక్షయ్ కుమార్ ప్రశంసలు

అమెరికాలోని న్యూజెర్సీలో నూతనంగా ప్రారంభించిన అతిపెద్ద  హిందూ  దేవాలయం అక్షరధామ్‌ పై  బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రశంసలు కురిపించాడు.   గురు మహంత్ స్వామి మహారాజ్‌ని దర్శించుకున్నందుకు  ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయంగా, ప్రపంచంలో రెండవ అతిపెద్ద హిందూ దేవాలయంగా అవతరించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. 

అక్షరధామ్‌ గురించి..  

 శ్రీకృష్ణుడి అంశగా ఆరాధించే స్వామి నారాయణ్‌ కొలువు దీరిన ఆలయమే అక్షరధామ్‌. అందమైన శిల్పాలతోనూ, భారీ గోపురాలతోనూ, అట్టహాసమైన మండపాలతోనూ కళ్లు చెదిరిపోయేలా తీర్చిదిద్దారు.గుజరాత్‌కు చెందిన బోచాసన్వాసి అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ(బీఏపీఎస్‌) ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ ఆలయ నిర్మాణంలో ఇసుమంతైనా ఉక్కూ ఇనుమూ వాడకుండానే వేలాది సంవత్సరాలపాటు చెక్కు చెదరని విధంగా నిర్మించడం విశేషం. 

ALSO READ : తిరుమల శ్రీవారి దర్శనానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు

భారత్‌లో ఉన్న ప్రముఖ దేవాలయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. 2011లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కాగా ఇటీవలే ప్రారంభించారు. ఈ మందిరం నిర్మాణానికి బీఏపీఎస్‌ దాదాపు రూ.150 కోట్లు ఖర్చుపెట్టింది