న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ రెడీ

న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ రెడీ

న్యూ ఇయర్ జోష్ కు హైదరాబాద్ సిటీ రెడీ అవుతోంది. ప్రత్యేక ఈవెంట్స్, డీజే మోతలతో సిటీ మారుమోగనుంది. రెండేండ్ల కరోనా గ్యాప్ తర్వాత... పూర్తి స్థాయిలో న్యూ ఇయర్ వేడుకలు జరగనున్నాయి. దీనికి తోడు ఈ ఏడాది డిసెంబర్ 31 శనివారం రావటంతో వీకెండ్ కూడా కలిసి వస్తోంది. దీంతో ఫుల్ గా ఎంజాయ్ చేసేందుకు యువత రెడీ అవుతోంది. వీటికి తగ్గట్టుగానే ప్రత్యేక ఈవెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు.

యువత న్యూ ఇయర్ వేడుకల హడావుడిలో ఉంటే... పోలీసులు మాత్రం రూల్స్ మస్ట్ అంటున్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పే టైంలో బ్లాక్ స్పాట్లలో పోలీసులు తనిఖీలు చేపట్టనున్నారు. డ్రంకెన్ డ్రైవ్ లు ఏర్పాటు చేయనున్నారు. తాగి రోడ్లపై అడ్డగోలుగా డ్రైవ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. బార్ లు, పబ్ లు, స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్న ఏరియాల్లో మూడు కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టారు. ట్రాఫిక్ పోలీస్ ఇన్ స్పెక్టర్ల  ఆధ్వర్యంలోని బృందాలు 31న రోజంతా డ్యూటీల్లో పాల్గొననున్నారు. 

31 రాత్రి నుంచి జనవరి 1న మార్నింగ్ వరకు నెక్లెస్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రేస్ వే, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు... పలు ప్లై ఓవర్లు మూసివేయనున్నారు. అటు విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు మస్ట్ గా సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించేలా చర్యలు చేపట్టారు. మద్యం మత్తులో వాహనాలు నడిపినా, ర్యాష్ డ్రైవింగ్, బైక్ లపై స్టంట్స్ చేసినా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.