అమ్మకానికి అంబానీ ఆస్తులు

అమ్మకానికి అంబానీ ఆస్తులు

అప్పుల సంక్షోభంలో కూరుకుపోయి దివాలాతీసిన అనిల్ అంబానీకి మరో షాక్‌ తగలనుంది. రుణ బకాయిలను తిరిగి సాధించుకునే పనిలో భాగంగా ఆస్తుల అమ్మకానికి ఆయా బ్యాంకులు సిద్ధ పడుతున్నాయి. అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ (RCL) ఆస్తులు అమ్మకానికి రంగం సిద్దం చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి, ఆసక్తి ఉన్నవర్గాలనుంచి బిడ్లను ఆహ్వానించినట్టు సమాచారం. దాదాపు 20వేల కోట్ల రూపాయల బకాయిల కోసం కీలక ఆస్తులను అమ్మే ప్రక్రియను ప్రారంభించాయని CNBC తెలిపింది.

NBI క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, JM ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ లెండర్స్‌ తరపున ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నాయి. RCL రుణంలో 93 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న డిబెంచర్ హోల్డర్ల కమిటీ (కోడిహెచ్) శనివారం ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ (EOI) లను ఆహ్వానించింది. ఈ బిడ్లను సమర్పించేందుకు తుది గడువు 2020 డిసెంబర్‌  ఒకటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ అనుబంధ సంస్థలలో RCL వాటాల్లో కొంత భాగానికి లేదా మొత్తం అమ్మనుంది.