Hari Hara Veeramallu Teaser: వాడొచ్చి దొంగ దొరల లెక్కలు సరి చేస్తాడు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న వీరమల్లు టీజర్

Hari Hara Veeramallu Teaser: వాడొచ్చి దొంగ దొరల లెక్కలు సరి చేస్తాడు..  గూస్బంప్స్ తెప్పిస్తున్న వీరమల్లు టీజర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్(Krish) కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ పీరియాడికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu). పవన్ కెరీర్ లో మెదటి పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ పెస్టిజియస్ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ లోనే కాదు.. నార్మల్ ఆడియన్స్ కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. 

చాలా కాలంగా ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుండి తాజాగా టీజర్  రిలీజ్ చేశారు. ధర్మం కోసం యుద్ధం అంటూ వచ్చిన ఈ టీజర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పేదవారిని బానిసలుగా చూస్తూ వారిని చిత్రహింసలు పెట్టే రాజుకు ఎదురునిలిచే పవర్ఫుల్ పాత్రలో పవన్ అదరగొట్టేశాడు. ఇక టీజర్లో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ.. వాడొచ్చి దొంగ దొరల లెక్కలు సరి చేస్తాడు.. అంటూ వచ్చిన డైలాగ్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది. ఇక ఈ టీజర్ కి ఎంఎం కీరవాణి అందించిన సంగీతం నెక్స్ట్ లెవల్లో ఉంది. మొత్తంగా చెప్పుకోవాలంటే గూస్బంప్స్ తెప్పించేలా ఉంది టీజర్. 

అంతేకాదు.. సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది. ఇక హరి హరి వీరమల్లు సినిమాను కూడా రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. మొదటి పార్టీ కి స్వర్డ్స్ వర్సెస్ స్పిరిట్ అంటే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమా ఈ ఏడాది థియేటర్స్ లోకి రానున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.