పోస్టల్‌‌‌‌ బ్యాలెట్‌‌‌‌కు అప్లై చేసుకోండి

పోస్టల్‌‌‌‌ బ్యాలెట్‌‌‌‌కు అప్లై చేసుకోండి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : మున్సిపల్‌‌‌‌ ఎన్నికల డ్యూటీచేసే  అధికారులు, సిబ్బంది పోస్టల్‌‌‌‌ బ్యాలెట్‌‌‌‌ కోసం అప్లై చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌‌‌‌కుమార్‌‌‌‌ సూచించారు. పంచాయతీరాజ్‌‌‌‌ ఎన్నికల్లో పోస్టల్‌‌‌‌ బ్యాలెట్లను చాలామంది వాడుకోలేదని, అందుకే ఈసారి మ్యానువల్‌‌‌‌గానూ పోస్టల్‌‌‌‌ బ్యాలెట్లు పొందే అవకాశం ఇస్తున్నట్టు చెప్పారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది రిటర్నింగ్‌‌‌‌ అధికారి నుంచి ఫామ్‌‌‌‌ -12ను తీసుకోవాలని, దాన్ని ఫిల్‌‌‌‌ చేసి తిరిగి ఇస్తే పోస్ట్​ ద్వారా బ్యాలెట్​ పేపర్​ పంపుతామన్నారు.  కౌంటింగ్‌‌‌‌ తేదీలోపు బ్యాలెట్​ను రిటర్నింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌కు అందజేయాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో యూఎల్‌‌‌‌బీ ఎలక్షన్స్‌‌‌‌ 2020 లింక్‌‌‌‌ను క్లిక్‌‌‌‌ చేసి కూడా ఫామ్‌‌‌‌-12ను పొందవచ్చన్నారు.