
పవన్ కళ్యాణ్(Pawan kalyan), రేణు దేశాయ్(Renu desai) విడిపోయి ఏళ్ళు గడుస్తున్నా.. ఆయన ఫ్యాన్స్ మాత్రం ఆమెను వదలడం లేదు. సోషల్ మీడియాలో ఆమె ఏ పోస్ట్ పెట్టునా అక్కడ కామెంట్స్ రూపంలో వాలిపోతారు. అయితే నెగిటీవ్ లేదా పాజిటీవ్ గా. ఈ విషయంపై చాలాసార్లు రేణు దేశాయ్ కూడా వివరణ ఇచ్చారు. దయచేసి ఆయన ప్రస్తావని నా దగ్గర తీసుకురాకండి అని. ఆయనపై కామెంట్స్ చేసినా.. చేయకపోయినా అది నాకే నెగిటీవ్ గా మారుతోంది అని. అయినా కూడా పట్టించుకోకవడంతో చాలా మందిని బ్లాక్ కూడా చేసింది. తాజాగా అలాంటి మరో ఇన్సిడెంట్ జరిగింది.
రేణు దేశాయ్ చిన్నప్పటినుండి జంతు ప్రేమికురాలు. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్స్టాలో పెట్స్ కి సంబందించిన ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో కింద ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. మీది కూడా పవన్ కళ్యాణ్ లాగే గోల్డెన్ హార్ట్.. అంటూ రాసుకొచ్చాడు. ఆ కామెంట్ కి సహనం కోల్పోయిన రేణు దేశాయ్ ఆ నెటిజన్ పై ఫైర్ అయ్యారు.. ఎందుకు నా చేసే పోస్టులను ప్రతిసారి నా ఎక్స్ హస్బెండ్ తో కంపేర్ చేస్తారు. ఇప్పటికే ఇలాంటి చాలా మందిని బ్లాక్ చేశాను, డిలీట్ కూడా చేశాను. నాకు పదేళ్లు ఉన్నప్పటి నుంచి యానిమల్స్ అంటే ఇష్టం. ప్రస్తుతం సింగిల్ గా యానిమల్ సర్వీస్ చేసుకుంటున్నాను. దీనికి నా ఎక్స్ హస్బెండ్ కి ఎలాంటి సంబంధం లేదు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.. ప్రతి పోస్ట్ కి ఆయనతో కంపేర్ చేస్తూ కామెంట్స్ చేయకండి. అతను నాలాగా యానిమల్స్ లవర్ కాదు.. అని రిప్లై ఇచ్చారు.
మళ్ళీ ఆ కామెంట్ ను స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేస్తూ.. ఇలాంటి కామెంట్స్ నాకు బాధని, కోపాన్ని కలిగిస్తున్నాయి. నా సొంతంగా నేను చేసుకునే పనులకు కూడా నా ఎక్స్ హస్బెండ్ తో కంపేర్ చేస్తున్నారు. నిజానికి అతనితో నాకెలాంటి పర్సనల్ ప్రాబ్లమ్ లేదు. కానీ, అతని ఫాలోవర్స్, ఫ్యాన్స్ నన్ను నన్నుగా ఉండనివ్వడం లేదు.. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.