
పలు చిత్రాల్లో నటుడిగా ఆకట్టుకున్న అజయ్ ఘోష్ (Ajay Ghosh) టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’(Music Shop Murthy). శివ పాలడుగు దర్శకత్వంలో హర్ష గారపాటి, రంగారావు నిర్మించారు. చాందిని చౌదరి హీరోయిన్గా నటించగా, భాను చందర్, ఆమని కీలక పాత్రలు పోషించారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ అవ్వగా..ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజీ టీజర్ చూస్తుంటే..సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్గా 'మ్యూజిక్ షాప్ మూర్తి'నుంచి అదిరిపోయే 'అంగ్రేజీ బీట్'డీజే సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.'ఏ మియా మియా'అంటూ సాగుతున్న ఈ పబ్ సాంగ్..యూత్ ను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటలో డీజేగా మారి అజయ్ ఘోష్ తన బాడీ లాంగ్వేజ్ తో అదరగొట్టేసారు. పవన్ లిరిక్స్ రాసి క్రేజీ మ్యూజిక్ అందించారు. యంగ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనదైన వాయిస్‌తో పవర్ ఫుల్‌గా పాడారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అంగ్రేజీ పబ్ సాంగ్ కు మ్యూజిక్ లవర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.మ్యూజిక్ షాప్ మూర్తిగా కనిపించబోతున్న అజయ్ ఘోష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
ఈ సినిమా కథ విషయానికి వేస్తే..చిన్నప్పటి నుండి మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న ఓ మిడిల్ క్లాస్ 50 ఏళ్ల వ్యక్తి క్యాసెట్లు అమ్ముకునే హైదరాబాద్ కు వచ్చి ఎలాగైనా..డీజే అవ్వాలని అనుకుంటాడు. అందుకోసం అతను ఎదుర్కొన్న సమస్యలు..చివరకి ఎదురైన కష్టాలన్నీ ఎలా దాటాడు? ఈ ప్రయాణంలో 25 ఏళ్ల అమ్మాయితో ఆయన ప్రయాణం ఎలా సాగింది? అనే విభిన్న కథాంశంతో శివ పాలడుగు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.