కాస్మొటిక్స్‌‌ వాడుతున్నారా..? ఈ 5 విషపదార్థాలు లేకుండా చూసుకోండి

కాస్మొటిక్స్‌‌ వాడుతున్నారా..? ఈ 5 విషపదార్థాలు లేకుండా చూసుకోండి

బాడీకి సూట్ కాకపోతే అలర్జీ.. క్యాన్సర్ కు దారితీయొచ్చు

చ‌‌ర్మం, జుట్టు అందంగా కనిపించేందుకు రకరకాల కాస్మొటిక్స్‌‌ వాడుతుంటాం. ఏదైనా ప్రాబ్లమ్‌‌ వచ్చిందంటే ఎవరో ఏదో సజెస్ట్‌‌ చేస్తారు.. దాన్ని కొనేస్తాం. అవి మన శరీరానికి సరిపడతాయా లేదా? అనే విషయం చూడం. దాంట్లో ఏ కెమికల్స్‌‌ ఉన్నాయి? అవి మనకు మేలు చేస్తాయా, కీడు చేస్తాయా? అనే విషయాన్ని కూడా గమనించం. అయితే కాస్మొటిక్స్‌‌ వాడేటప్పుడు కచ్చితంగా అన్నీ చూసుకుని కొనాలని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెప్తున్నారు. వాటిలో ఉండే కొన్ని కెమికల్స్‌‌ మన చర్మానికి హాని చేస్తాయని అంటున్నారు. చర్మంపై మనం ఏమైనా రాస్తే దాదాపు 30 సెకెన్లలో అది దాన్ని అబ్జార్బ్​ చేస్తుంది. అందుకే కెమికల్స్‌‌ వల్ల ఎలర్జీ, కేన్సర్‌‌‌‌ లాంటి మెడికల్‌‌ ఇష్యూస్‌‌ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.  కెమికల్స్‌‌ లేని వాటిని ప్రిఫర్‌‌‌‌ చేయాలని, కొనేముందు ఒకటికి రెండుసార్లు చెక్‌‌ చేసుకుని కొంటే సేఫ్‌‌ అని జాగ్రత్తలు చెప్తున్నారు.  విషపూరితం కానీ ప్రొడక్ట్స్‌‌ తీసుకోవడం మంచిదని, దానివల్ల మేలు కలుగుతుందని చెప్తున్నారు. కాస్మొటిక్స్‌‌లో ఈ ఐదు విషపదార్థాలు ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు.

సల్ఫేట్స్

సబ్బులు, షాంపూలు, షవర్‌‌‌‌జల్స్‌‌, షేషియల్‌‌ క్లెన్సింగ్‌‌లో నురగ ఎక్కువగా వచ్చేందుకు సల్ఫేట్‌‌ను ఉపయోగిస్తారు. అయితే ఇది మంచిది  కాదని ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నారు. సల్ఫేట్‌‌ ఎక్కువగా ఉన్న కాస్మొటిక్స్‌‌ వాడితే స్కాల్ప్‌‌, స్కిన్‌‌ మీద ఉండే హైడ్రోపోలిక్‌‌ ఫిల్మ్ తొలగిపోతుంది. దానివల్ల ఇరిటేషన్‌‌, డ్రైనెస్‌‌ పెరుగుతుంది. కాస్మొటిక్స్‌‌లో సల్ఫేట్‌‌ ఎస్‌‌ఎల్‌‌ఎస్‌‌, ఎస్‌‌ఎల్‌‌ఈఎస్‌‌ల ఫామ్‌‌లో ఉంటుంది. దీని వల్ల కళ్లు, చర్మం, ఉపిరితిత్తులకు కూడా ఎఫెక్ట్‌‌ పడుతుంది.

ట్రైక్లోసన్‌‌

ఫేస్‌‌వాష్‌‌, హ్యాండ్‌‌ శానిటైజర్స్‌‌, టూత్​పేస్ట్‌‌ లాంటి వాటిల్లో యాంటీ బ్యాక్టీరియల్‌‌ ఏజెంట్‌‌గా ట్రైక్లోసన్‌‌ను వాడతారు. అయితే ఇది ఉండటం వల్ల అలెర్జీలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సబ్బుల్లో దీని వాడకాన్ని ఎఫ్​డీఏ నిషేధించింది. దీని ఉత్పత్తుల వల్ల పర్యావరణానికి కూడా చాలా దెబ్బ అని ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నారు. దీనివల్ల చేపలు, ఇతర జంతువులకు హాని కలుగుతుందని, నదులు, మహాసముద్రాలు కలుషితం అవుతాయని చెప్తున్నారు.

పెట్రో కెమికల్‌‌

సాధారణంగా మనం ముఖానికి వాడే ప్రతి కాస్మొటిక్‌‌ ప్రొడక్ట్స్​లో ఈ పెట్రో కెమికల్‌‌ ఉంటుంది. ఇది చర్మాన్ని స్మూత్‌‌గా చేస్తుంది. కానీ చర్మంపై ఉన్న రంధ్రాలను పూర్తిగా మూసేస్తుందని, దాని వల్ల గాలి, నీరు లోపలికి వెళ్లకుండా నిరోధిస్తుందని దానివల్ల డెడ్‌‌స్కిన్‌‌ ఏర్పడుతుందని, బ్లాక్‌‌హెడ్స్‌‌ లాంటివి ఏర్పడతాయని ఎక్స్‌‌పర్ట్స్ చెప్తున్నారు. అందుకే కాస్మొటిక్స్‌‌ కొనేటప్పుడు కచ్చితంగా పెట్రోకెమికల్స్‌‌ గురించి చదివి కొనుక్కోవాలని చెప్తున్నారు.

పీఈజీఎస్‌‌

కాస్మొటిక్స్‌ స్టికీగా, థిక్‌‌గా వచ్చేందుకు పాలీథలిన్‌‌ గ్లైసోల్‌‌ను యూజ్‌‌ చేస్తారు. ఇది వాడటం వల్ల మన నెర్వస్‌‌సిస్టమ్‌‌ డ్యామేజ్‌‌ అవుతుందని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెప్తున్నారు. వరల్డ్‌‌వార్‌‌‌‌ – 2 టైంలె దీన్ని నెర్వ్‌‌గ్యాస్‌‌గా ఉపయోగించారని, అలాంటిదాన్ని స్కిన్‌‌పైన పెట్టుకుంటే ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవాలని చెప్పారు.

పారాబెన్స్‌‌

పారాబెన్స్‌‌ అనేవి కాస్మొటిక్స్‌‌లో ఎక్కువగా వాడే ప్రిజర్వేటివ్స్‌‌. దీన్ని ఎక్కువగా వాడటం వల్ల శరీరంలో మిమిక్‌‌ ఈస్ట్రోజన్‌‌ ఎక్కువ అవుతుంది. దీంతో హార్మోనల్‌‌ ఇంబ్యాలెన్స్‌‌ అవుతుందని ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నారు. అంతే కాకుండా బ్రెస్ట్‌‌కేన్సర్‌‌‌‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 2011లో నిర్వహించిన ఒక స్టడీలో ఇది వెల్లడైంది.