ఆసుపత్రిలో చేరిన ప్రముఖ యాక్టర్...

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ యాక్టర్...

ప్రముఖ హిందీ సీరియల్ యాక్టర్ అర్జున్ బిజ్లానీ కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. నాగిన్, మిలే జబ్ హమ్, తుమ్ వంటి సీరియల్స్ తో ఇతడు ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అర్జున్, రెగ్యులర్ గా తన అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటాడు. ఈ నేపథ్యంలో హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపాడు. హాస్పిటల్ బెడ్ మీద చేతికి సెలైన్ ఇంజెక్షన్ ఉన్న ఫోటోను షేర్ చేశాడు.

తనకు తీవ్ర కడుపు నొప్పి వచ్చిందని, నొప్పి వల్ల షూటింగ్స్ కి అటెండ్ అవ్వలేకపోతున్నానని అన్నాడు. ఎక్స్ - రే తీస్తే కానీ తన పరిస్థితి ఏంటో క్లియర్ గా చెప్పలేనని అన్నాడు. ఏది జరిగినా మంచికే అనే క్యాప్షన్ తో హాస్పిటల్ బెడ్ మీదున్న ఫోటోస్ ను షేర్ చేశాడు అర్జున్ బిజ్లానీ. సీరియల్స్ ద్వారానే కాకుండా పలు రియాలిటీ షోల ద్వారా కూడా అర్జున్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అర్జున్ త్వరగా కోలుకోవాలంటూ తన పోస్ట్ కింద కామెంట్స్ చేస్తున్నారు అతని ఫ్యాన్స్.