ఆర్మీ చీఫ్​ ముకుంద్ ​నర్వానె

ఆర్మీ చీఫ్​ ముకుంద్ ​నర్వానె

జనరల్ బిపిన్​ రావత్​కు వీడ్కోలు

మిలిటరీ అఫైర్స్​ డిపార్ట్​మెంట్​ ఏర్పాటు

సీడీఎస్​ ఏర్పాటును తప్పుపట్టిన కాంగ్రెస్

 

ఆర్మీ కొత్త చీఫ్​గా జనరల్​ ముకుంద్​ ​నర్వానె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 13 లక్షల మంది సైనికులతో బలమైన ఇండియన్​ ఆర్మీకి ​నర్వానె 28వ చీఫ్.. డిసెంబర్​ 31స     జనరల్​ బిపిన్​ రావత్​ చీఫ్​ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో వైస్​చీఫ్​గా ఉన్న ​నర్వానెను కేంద్రం కొత్త చీఫ్​గా ప్రకటించింది. క్రాస్​బోర్డర్​ టెర్రరిజంతో పాటు బోర్డర్​ వెంట చైనా సైనికుల కదలికలు కొత్త చీఫ్​కు సవాలుగా మారనున్నాయి. ఇక ఆర్మీలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందనేది ఎంతోకాలంగా వినిపిస్తున్న డిమాండ్.. కొత్త చీఫ్​ ​నర్వానె ఆర్మీలో సంస్కరణలు తీసుకొస్తారా అనేది వేచిచూడాల్సిందే!

పలు హోదాల్లో 37 ఏళ్లుగా సేవలు..

37 ఏళ్ల తన కెరీర్​లో జనరల్​ ​నర్వానె వివిధ హోదాల్లో పనిచేశారు. అడ్మినిస్ట్రేషన్​తో పాటు ఫీల్డ్​లో.. అదీ జమ్మూ కాశ్మీర్, నార్త్​ ఈస్ట్​ ప్రాంతాల్లో ఆర్మీకి సేవలందించారు. జమ్మూకాశ్మీర్​కు చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్​లో, ఈస్ట్రన్​ ఫ్రంట్​లో బ్రిగేడియర్​గా, శ్రీలంకకు పంపిన  ఇండియన్​ పీస్​ కీపింగ్​ ఫోర్స్​లోనూ ఆయన సేవలందించారు. 1980లో సిఖ్​లైట్ ఇన్​ఫాంట్రీ రెజిమెంట్​లోని ఏడో బెటాలియన్​లోనూ ​నర్వానె పనిచేశారు. పలు హోదాల్లో ఆయన అందించిన సేవలకు గాను ఆర్మీ ఆయనను సేనా మెడల్, విశిష్ఠ సేవా మెడల్, అతి విశిష్ఠ సేవా మెడల్ లతో సత్కరించింది. మరోవైపు, మూడేళ్ల పాటు చీఫ్​గా సేవలందించిన  రావత్​కు సైన్యం మంగళవారం గార్డ్​ ఆఫ్ హానర్​తో ఫేర్​వెల్ పలికింది. ఈ సందర్భంగా డ్యూటీలో తనకు సహకరించిన తోటి ఉద్యోగులకు, వారి ఫ్యామిలీలకు రావత్ ధన్యవాదాలు తెలిపారు. కొత్త చీఫ్​ ​నర్వానెను అభినందించారు.

మిలిటరీ అఫైర్స్​ డిపార్ట్​మెంట్

రక్షణ శాఖలో కొత్తగా మిలిటరీ అఫైర్స్​ డిపార్ట్​మెంట్​ను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సీడీఎస్​ బిపిన్​ రావత్​ దీనికి బాస్​గా వ్యవహరిస్తారని పేర్కొంది. ఆర్మీ, నేవీ, ఎయిర్​ ఫోర్స్ వ్యవహారాల్లో కో–ఆర్డినేషన్, చేపట్టే ఆపరేషన్లలో అవసరమైన సహాయ సహకారాలు అందించుకోవడానికి ఈ కొత్త డిపార్ట్​మెంట్​ఉపయోగపడుతుందని తెలిపింది. ఉమ్మడి ప్లానింగ్​తో సిబ్బందికి ట్రైనింగ్​ఇవ్వడం.. తదితర వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని వివరించింది. మరీ ముఖ్యంగా సొంతంగా తయారు చేసుకున్న వస్తువులు, ఆయుధాల ఉపయోగాన్ని ప్రమోట్​ చేస్తుందని తెలిపింది. ఈమేరకు చట్టంలో సవరణలు చేసి, రాష్ట్రపతి ఆమోదంతో ఈ డిపార్ట్​మెంట్​ను ఏర్పాటు చేసినట్లు కేంద్రం
ప్రకటించింది.

సీడీఎస్ ​ఏర్పాటు ఓ తప్పటడుగు: కాంగ్రెస్

చీఫ్​ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్(సీడీఎస్) నియామకం ఓ తప్పటడుగు అని కాంగ్రెస్​ ఆరోపించింది. దురదృష్టవశాత్తూ దీని ఫలితాలు కొంతకాలం గడిచాకే బయటపడతాయని పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ ట్విట్టర్​లో విమర్శించారు. సీడీఎస్​గా జనరల్​ బిపిన్​ రావత్​ నియామకాన్నీ తప్పుబట్టారు. సీడీఎస్​ అధికార పరిధిపైనా సందేహాలు వ్యక్తం చేశారు. రక్షణ శాఖకు సమర్పించే  మూడు సర్వీసుల చీఫ్​ల సలహాలు, సూచనలను సీడీఎస్​ మార్చగలడా అని ప్రశ్నించారు. ముగ్గురు చీఫ్​లు ఇకపై సీడీఎస్​ ద్వారా రక్షణ మంత్రికి రిపోర్టు చేయాలా అని తివారీ నిలదీశారు.

టెర్రరిజం ప్రపంచానికే సమస్య

టెర్రరిజం ఒక్క మనదేశానికే కాదు ప్రపంచానికే సమస్య.. మనం చాలాకాలంగా బాధపడుతుంటే, మిగతా దేశాలపైనా ప్రభావం పడుతోంది. టెర్రరిజం వల్ల వచ్చే సమస్యలపై ప్రపంచ దేశాలకు ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. – జనరల్​ ముకుంద్​ ​నర్వానె, ఆర్మీ చీఫ్

రెండు దేశాలకు ఎంతో మేలు: యూఎస్‌‌‌‌
సీడీఎస్​గా నియమితులైన జనరల్ బిపిన్​ రావత్​కు అమెరికా అభినందనలు తెలిపింది. రావత్​ నియామకంతో ఇండియా, యూఎస్​ డిఫెన్స్​ వర్గాల  మధ్య కోఆపరేషన్​ మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.