నో క్రిమినల్ కేసు..ఐదేళ్లలో రూ. 7 కోట్లు పెరిగిన ఆస్తులు

నో క్రిమినల్ కేసు..ఐదేళ్లలో రూ. 7 కోట్లు పెరిగిన ఆస్తులు

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు.  హింజిలీ అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఆరోసారి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులను రూ. 71.07 కోట్లుగా ప్రకటించారు. అఫిడవిట్‌లో రూ.  14.05 కోట్లకు పైగా చరాస్తులు, రూ. 57.02 కోట్ల విలువైన స్థిరాస్తులను పేర్కొన్నారు.  

భువనేశ్వర్‌లోని రూ.  13.66-కోట్ల నివాసం, న్యూఢిల్లీలోని APJ అబ్దుల్ కలాం రోడ్‌లోని రూ. 43.35-కోట్ల విలువైన ఇల్లు అతని స్థిరాస్తులలో ఉన్నాయి. తన చేతిలో రూ. 30,000, 1980 మోడల్ అంబాసిడర్ కారు ఉన్నట్లు కూడా సీఎం తన అఫిడవిట్‌లో  పేర్కొన్నారు.  తనపై ఎలాంటి  క్రిమినల్ కేసు లేదని నవీన్ పట్నాయక్  తెలిపారు.   

గడిచిన ఐదేళ్లలో  సీఎం ఆస్తుల విలువ రూ. 7 కోట్లకు పైగా పెరిగింది.  బీజేడీ చీఫ్ 2019 ఎన్నికల్లో  రూ.  63.87 కోట్ల ఆస్తులను చూపించారు .  ఒడిశాలో 147 నియోజకవర్గాలకు గాను నాలుగు దశల్లో(మే 13, 20, 25, జూన్1 తేదీల్లో) ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 04న ఫలితాలు వెలువడనున్నాయి.