మే నెలలోనూ భగభగ.. దేశంలోని చాలా చోట్ల హై టెంపరేచర్స్: ఐఎండీ

మే నెలలోనూ భగభగ.. దేశంలోని చాలా చోట్ల హై టెంపరేచర్స్: ఐఎండీ

న్యూఢిల్లీ: ఈ నెలలోనూ దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ఠంకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ముఖ్యంగా హీట్​ వేవ్​ రోజుల సంఖ్య అత్యధికంగా ఉన్నట్టు తెలిపింది. ఉత్తర, మధ్య భారతదేశంలో తీవ్ర వడగాల్పులు ఉంటాయని ఐఎండీ చీఫ్​ మృత్యుంజయ మోహపాత్ర బుధవారం మీడియాకు వెల్లడించారు.

రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్​, విదర్భ, మరాఠ్వాడా, గుజరాత్​ రీజియన్​లో 8–11 రోజులపాటు హీట్​వేవ్స్​ ఉంటాయని తెలిపారు. అలాగే, రాజస్థాన్​ మిగతా ప్రాంతాల్లో, తూర్పు మధ్యప్రదేశ్​, పంజాబ్​, హర్యానా, చండీగఢ్​, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్​, చత్తీస్​గఢ్​లోని కొన్నిప్రాంతాలు, ఒడిశా మారుమూల ప్రాంతాలు, పశ్చిమబెంగాల్​, జార్ఖండ్, బిహార్​, ఉత్తర కర్నాటక, తెలంగాణలో 5–7 రోజులపాటు హీట్​వేవ్స్​ ఉంటాయని వివరించారు.  మిగతా చోట్ల 3 రోజులపాటు వేడిగాలులు వీస్తాయని తెలిపారు.