గ్రూప్–1 ఎగ్జామ్​కు పకడ్బందీ ఏర్పాట్లు

గ్రూప్–1 ఎగ్జామ్​కు పకడ్బందీ ఏర్పాట్లు

వనపర్తి టౌన్, వెలుగు: జూన్ 9న నిర్వహించే గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1 ప్రిలిమినరీ పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేజస్  నందలాల్  పవార్  అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్  పరిశీలించారు. మర్రికుంటలోని గిరిజన సంక్షేమ పాఠశాల, చాణక్య హైస్కూల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. పరీక్ష నిర్వహించేందుకు స్కూళ్లలో ఉన్న సౌలతులపై ఆరా తీశారు.

సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫ్యాన్లు, విద్యుత్  సరఫరా, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌలతులు ఉండేలా చూడాలన్నారు. పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. అనంతరం బాయ్స్​ హైస్కూల్​లో కొనసాగుతున్న ఓపెన్  ఇంటర్  ఎగ్జామ్​ నిర్వహణ, విద్యార్థుల హాజరుపై చీఫ్  సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. గిరిజన సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్  గోవర్ధన్, గర్ల్స్​ హైస్కూల్​ ప్రిన్సిపాల్  ఉమాదేవి, చీఫ్  సూపరింటెండెంట్  నరేందర్  పాల్గొన్నారు.

అదనపు బ్యాలెట్​ యూనిట్లు సిద్ధం

వనపర్తి: నాగర్ కర్నూల్  పార్లమెంట్  నియోజకవర్గంలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో అదనపు బ్యాలెట్  యూనిట్లు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్  తేజస్  నంద లాల్  పవార్  తెలిపారు.   బుధవారం స్థానిక ఆర్డీవో ఆఫీస్  ఆవరణలోని ఈవీఎం గోదామ్​లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల మొదటి విడత తనిఖీని కలెక్టర్  పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ప్రతి పోలింగ్  స్టేషన్ లో రెండేసి  బ్యాలెట్  యూనిట్లు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్  ఆదేశాల మేరకు అదనపు యూనిట్లకు ఎఫ్ఎల్సీ చేసి సిద్ధం చేశామన్నారు. అడిషనల్​ కలెక్టర్ నగేశ్, ఎంసీసీ నోడల్  ఆఫీసర్, ఆర్డీవో పద్మావతి, సి సెక్షన్ సుపరింటెండెంట్  రమేశ్ రెడ్డి, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం ప్రతినిధులు కుమారస్వామి, త్రినాథ్, పరమేశ్వర చారి పాల్గొన్నారు.