కౌన్సిలర్లను గెలిపించుకోవాలి: మంత్రి జూపల్లి

కౌన్సిలర్లను గెలిపించుకోవాలి: మంత్రి జూపల్లి

ఆమనగల్లు, వెలుగు: మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్  క్యాండిడేట్లను గెలిపించుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ఆదివారం ఆమనగల్లులో కాంగ్రెస్  నాయకులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు అభివృద్ధి నిరోధుకులుగా మారారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్  క్యాండిడేట్లను గెలిపించాలని ఓటర్లను కోరాలని సూచించారు. ఏఎంసీ మాజీ వైస్  చైర్మన్  గుర్రం కేశవులు, నాయకులు కృష్ణ నాయక్, ఖాదర్  పాల్గొన్నారు.