బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి ; ఎస్పీ వినీత్

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి ; ఎస్పీ వినీత్

మక్తల్( నారాయణపేట), వెలుగు: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ వినీత్  పిలుపునిచ్చారు. ఆదివారం ఎస్పీ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్  స్మైల్-ను చేపట్టామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించి 71 మంది బాల కార్మికులను గుర్తించామని, వీరిలో 51 మంది బాలురు, 20 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. 

36 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన బాల కార్మికులు ఉన్నారని చెప్పారు. 36 కేసులు నమోదు చేశామని, పనిలో పెట్టుకున్న యాజమానులకు జరిమానాలు విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా పిల్లలను పనిలో పెట్టుకుంటే చైల్డ్  హెల్ప్ లైన్  1098, డయల్  100కు సమాచారం ఇవ్వాలని కోరారు.