ఎన్‌‌బీఎఫ్‌‌ ప్రెసిడెంట్​గా అర్ణబ్ గోస్వామి

ఎన్‌‌బీఎఫ్‌‌ ప్రెసిడెంట్​గా అర్ణబ్ గోస్వామి

న్యూఢిల్లీ: న్యూస్‌‌ చానల్స్‌‌కు సంబంధించి దేశంలో అతిపెద్ద అసోసియేషన్‌‌ అయిన న్యూస్‌‌ బ్రాడ్‌‌కాస్టర్స్‌‌ ఫెడరేషన్‌‌ (ఎన్‌‌బీఎఫ్‌‌)కు అధ్యక్షుడిగా రిపబ్లిక్‌‌ టీవీ ఎడిటర్‌‌ ఇన్‌‌ చీఫ్‌‌ అర్ణబ్‌‌ గోస్వామి ఎన్నికయ్యారు. అసోసియేషన్‌‌ గవర్నింగ్‌‌ బోర్డు ప్రెసిడెంట్​గా అర్ణబ్‌‌ను మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఎన్‌‌బీఎఫ్‌‌ వెల్లడించింది. నలుగురు వైస్‌‌ ప్రెసిడెంట్లను కూడా ఎన్నుకున్నామంది. చానళ్లలో ప్రసారం చేసే కంటెంట్‌‌ సెల్ఫ్‌‌ రెగ్యులేషన్‌‌కు విధివిధానాలు ఫైనల్‌‌ చేసేందుకు అసోసియేషన్‌‌ శనివారం సమావేశమై గవర్నింగ్‌‌ బోర్డును ఎన్నుకుంది. 2020 జనవరి చివరి నాటికి ఈ ఆర్గనైజేషన్‌‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్‌‌బీఎఫ్‌‌లో 25 రాష్ట్రాల్లోని 14 భాషలకు చెందిన 78 న్యూస్‌‌ చానల్స్‌‌ ఉన్నాయి. ఎంతో నమ్మకంతో తనను ఎన్నుకున్నందుకు సభ్యులకు గోస్వామి కృతజ్ఞతలు తెలిపారు. కొన్నేళ్లుగా ఢిల్లీలోని కొన్ని న్యూస్‌‌ చానళ్లు ఇండియన్‌‌ బ్రాడ్‌‌కాస్టర్స్‌‌గా చెప్పుకుంటున్నారని, ఎన్‌‌బీఎఫ్‌‌ దీన్నంతటిని మారుస్తుందని చెప్పారు. ఎన్‌‌బీఎఫ్‌‌ ఫౌండింగ్‌‌ మెంబర్లలో రిపబ్లిక్‌‌ టీవి, పుథియథలైమురయ్‌‌ (తమిళనాడు), వీ6 న్యూస్‌‌ (తెలంగాణ), ఒరిస్సా టీవీ, ఐబీసీ24 (మధ్యప్రదేశ్‌‌, చత్తీస్‌‌గఢ్‌‌), సీవీఆర్‌‌ (ఆంధ్రప్రదేశ్‌‌, తెలంగాణ) తదితర చానళ్లు ఉన్నాయి.