దేశంలో చిచ్చురేపేందుకు అసదుద్దీన్ ప్రయత్నం

దేశంలో చిచ్చురేపేందుకు అసదుద్దీన్ ప్రయత్నం

అసదుద్దీన్ పై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఫైర్

హైదరాబాద్, వెలుగు: ఎంఐఎం చీఫ్​ అసదుద్దీన్ ఒవైసీ నయా జిన్నా అని, దేశం ముక్కలు కవాలన్నదే ఆయన ఉద్దేశమని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్​దే అయినా ఆత్మ మాత్రం అసదుద్దీన్​దేనని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్​లో లాయర్ల ఆధ్వర్యంలో సీఏఏపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసదుద్దీదన్ దేశంలో చిచ్చురేపేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఢిల్లీలో పోలీసులపై దాడి చేయడం దేశ సెక్యూరిటీకే ప్రశ్నార్థకమన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడం.. దేశంపై యుద్ధం లాంటిదేనన్నారు. పౌరసత్వం ఎవరికి ఇవ్వాలనేది పార్లమెంట్ నిర్ణయింస్తుందని, పార్లమెంట్ చేసిన చట్టాన్నే ఆమోదించకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అద్నాన్ సమీకి సిటిజన్ షిప్ ఇచ్చామని, తస్లిమా నస్రీన్ కూడా ఈ దేశంలోనే ఉంటోందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

చదువుకున్న అజ్ఞాని కేటీఆర్: కె.లక్ష్మణ్​

మంత్రి కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని అని, మున్సిపల్ ఎన్నికల సమయంలో సీఏఏ గురించి మాట్లాడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సీఏఏ మతపరమైన వివక్ష ఎదుర్కొంటున్న వారి కోసం చేసిన సవరణ అని చెప్పారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్​ రాజ్యాంగం చదవలేదా, సీఏఏకు వ్యతిరేకంగా చేసిన తీర్మాణం చెల్లుతుందా? అని ప్రశ్నించారు. ముస్లిం పదం చేర్చడు కాదు. పాకిస్తాన్​ముస్లింలను కన్విన్స్ చేసి, ఇమ్రాన్ ఖాన్ ను ఒప్పించు. అఖండ భారత్ చేద్దం’ అని లక్ష్మణ్ అన్నారు. తస్లిమా నస్రీన్ హైదరాబాద్ వస్తే ఎంఐఎం నేతలు చెప్పులతో దాడి చేశారని, ఆమె బెంగాల్​ వెళ్తే మమతా వెళ్లగొట్టిందని తెలిపారు. ట్విట్టర్ పిట్ట కేటీఆర్.. వారిస్ పఠాన్,​ అక్బరుద్దీన్ కామెంట్లపై స్పందించలేదని విమర్శించారు.

For More News..

ఇంటింటికీ యాంటీ కరోనా టీం

నిజామాబాద్ ​ఎమ్మెల్సీ రేసులో కవిత

మార్చి 31 వరకు కరోనా సెలవులు

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. హాఫ్ డే స్కూల్స్ తేదీ ఖరారు