లంగర్‌హౌస్ బాపూ ఘాట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. హైస్పీడ్ లో వచ్చిన కారు డైరెక్ట్‌గా రోడ్ పక్కన ఉన్న ఫ్రూట్ షాప్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఫ్రూట్ షాప్ లో ఉన్న వ్యక్తితో పాటు అక్కడే ఉన్న బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు వెంటనే హాస్పిటల్ కి తరలించారు. కార్ డ్రైవర్ ని పట్టుకొని స్థానికులు పోలీసులకు అప్పగించారు. కంట్రోల్ కాకపోవడంతో కారు ఫ్రూట్ షాప్స్ లోకి దూసుకెళ్లినట్టుగా స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
