మాదాపూర్‌, గచ్చిబౌలి లో ఫుల్ ట్రాఫిక్‌ జామ్‌

మాదాపూర్‌, గచ్చిబౌలి లో ఫుల్ ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్  లో భారీ వర్షం పడటంతో  రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో  పలు చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా  మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.  ఆఫీసుల నుంచి ఒకేసారి ఐటీ ఉద్యోగులంతా బయటకు రావటంతో ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. దీనికి తోడు రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయ కలుగుతోంది. సైబర్‌ టవర్స్‌ వద్ద వరద నీరు చేరింది. 

మాదాపూర్‌ నుంచి కేపీహెచ్‌బీ వైపు వెళ్లే మార్గంలో  చాలామంది ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయారు.  మైండ్‌ స్పేస్‌ నుంచి ఐకియా మార్గంలో మెల్లగా వాహనాలు కదులుతున్నాయి.   . మరోవైపు వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మ్యాన్ హోల్స్ నిండిన పలు ప్రాంతాలను క్లియర్ చేస్తున్నారు. . రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

హైదరాబాద్‌ లో  సుమారు గంటన్నర పాటు నుంచి ఏకధాటిగా వర్షం పడింది.  దీంతో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ప్రజల కోసం GHMC టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. GHMC-DRF సహాయం కోసం 040-21111111 లేదా 9000113667కు ఫోన్ చేయాలని పేర్కొంది. వర్షం వేళ అవ‌స‌ర‌మైతే త‌ప్ప ప్రజ‌లు ఇళ్లలో నుంచి బ‌య‌ట‌కు రావొద్దని సూచించింది.