
యూఎస్ యూనివర్సిటీల్లో చదుతువుతున్న స్టూడెంట్స్ సెమిస్టర్ ఫీజు తమ ద్వారా చెల్లిస్తే 10శాతం డిస్కౌంట్ ఇస్తామంటూ మోసం చేసిన కనోళ్ళ అశోక్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన అశోక్ కుమార్ ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్ అనే యువకుడికి 10 శాతం డిస్కౌంట్ ఇప్పిస్తానని రూ.4 లక్షల 38 వేల 599 రూపాయలు వసూలు చేసి మోసం చేశాడు అశోక్. దీంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన పోలీసులు అశోక్ కుమార్ పై ఐపీసీ సెక్షన్ 419, 420 కింద కేసు నమోదు చేశారు. నిందితుడు అశోక్ మొబైల్ ని పోలీసులు సీజ్ చేశారు. గతంలో అశోక్ USA కన్సల్టెంట్ ఏజెన్సీలో పనిచేశాడు.