జులై 15వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

జులై 15వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

జులై 15వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో  డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే షెడ్యూల్ ప్రకారం నడవాల్సిన విమాన సర్వీసులు ఆయా దేశాల్లో కరోనా కేసులపై ఆధార పడి ఉంటుందని తెలిపింది.

కాగా గతంలో  కరోనా వైరస్ వ్యాప్తి  కారణంగా కేంద్రం ఆదేశాలతో  మార్చి 23 నుంచే అంతర్జాతీయ విమాన సర్వీసులను డీజీసీఏ నిలిపివేసింది. అయితే.. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులకు అనుమతి ఇచ్చింది. అంతర్జాతీయ సర్వీసులపై ఆంక్షలు కొనసాగించింది. ఆ ఆంక్షలు తొలగి పోయి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయిని అందరూ భావించారు. కానీ తాజాగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.