బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం
న్యూఢిల్లీ: ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ గురువారం స్పష్టతను ఇచ్చాడు. ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే దానిపై ఫ్యాన్స్, ఫ్రాంచైజీలు, ప్లేయర్స్, బ్రాడ్‌కాస్టర్స్, స్పాన్సర్స్, స్టేక్‌హోల్డర్స్ ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో.. ఖాళీ మైదానాల్లోనూ ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు గంగూలీ తెలిపాడు. ఈ ఏడాది క్లోజ్డ్ డోర్స్‌లో ఐపీఎల్‌ను నిర్వహించడానికి బోర్డు రెడీగా ఉందని, దీనికి సంబంధించిన అన్ని ఆప్షన్స్‌ను పరిశీలిస్తున్నామని చెప్పాడు.
‘ఈ ఏడాది ఐపీఎల్‌లో పాల్గొనడంపై ఇండియాతోపాటు మిగతా దేశాల ప్లేయర్స్ తమ ఆసక్తిని చూపిస్తున్నారు. మేం చాలా ఆశాజనకంగా ఉన్నాం. దీనిపై భవిష్యత్ నిర్ణయాలను బీసీసీఐ త్వరలో తీసుకుంటుంది. అన్ని స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్‌కు అవసరమైన కొవిడ్–19 స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ను డెవలప్ చేసే ప్రాసెసెలో బీసీసీఐ నిమగ్నమై ఉంది. ఆయా ఏరియాల్లో క్రికెట్‌ను పునరుద్ధరించడానికి ఎస్‌ఓపీని స్టాండర్డ్ గైడ్‌లైన్స్‌తో రూపొందిస్తున్నాం’ అని దాదా పేర్కొన్నాడు.

