V6 News

108లో ఉద్యోగాలు ఏప్రిల్ 21 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు

108లో ఉద్యోగాలు ఏప్రిల్ 21 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు

పద్మారావునగర్, వెలుగు:108 ప్రాజెక్ట్​లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఈఎంఆర్ఐ సంస్థ వెల్లడించింది. ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హత కలిగి, ఎంఎస్ ఆఫీస్​తో పాటు టైపింగ్ స్కిల్స్ ఉన్న 20 నుంచి 30 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎంపికైన వారు వెంగళరావు నగర్​లోని 108 కాల్ సెంటర్​లో రోజుకు 9 గంటల (ఒక గంట విరామంతో కలిపి) షిఫ్ట్ పద్ధతిలో పనిచేయాల్సి ఉంటుందని, నెలకు రూ. 13,000 జీతం అందించనున్నట్లు తెలిపింది. 

ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 21 నుంచి 25 వరకు వెంగళరావు నగర్​లోని కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని, ఇతర వివరాల కోసం 9154205443 నంబర్​ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.