హైదరాబాద్: ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం (ఏప్రిల్ 22) తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన నాదెండ్ల మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 1935, జూన్ 23న నాదెండ్ల భాస్కర్ రావు జన్మించారు. 1978 నుంచి 1989 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 1984 ఆగస్ట్ 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కేవలం నెల రోజులు సీఎంగా పని చేశారు.

