హైదరాబాద్, వెలుగు: యూఎస్ టెక్ కంపెనీ ఐబీఎం విశాఖపట్నంలో తన సరికొత్త కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించింది. ఏఐ, హైబ్రిడ్ క్లౌడ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ సేవలను అందించడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు.
విశాఖపట్నం గ్లోబల్ హబ్‌గా ఎదుగుతున్న తరుణంలో ఈ కేంద్రం ఏర్పాటు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. డిజిటల్ రంగంలో నైపుణ్యాలు కలిగిన యువతకు ఈ కేంద్రం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మనదేశంలో ఐబీఎంకు ఇది 15వ ఫ్యూచర్ నౌ కేంద్రం.
